సోషల్ మీడియాలో విజయ్ దేవరకొండ రికార్డు
- ఇన్ స్టాగ్రామ్ లో 9 మిలియన్ల ఫాలోవర్స్
- దక్షిణాదిన మరే హీరోకు సాధ్యం కాని ఘనత
- భారీ విజయాలతో క్రేజ్ పెంచుకుంటున్న విజయ్ దేవరకొండ
పెళ్లిచూపులు చిత్రంతో సక్సెస్ రుచి చూసిన విజయ్... ఆ తర్వాత అర్జున్ రెడ్డితో సంచలనం సృష్టించాడు. ఆ తర్వాత వచ్చిన గీతగోవిందంతో స్టార్ డమ్ వచ్చింది. ప్రస్తుతం విజయ్ ఫైటర్ సినిమా చేస్తున్నాడు. పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో వస్తున్న ఈ చిత్రంపై భారీగా అంచనాలు ఉన్నాయి. ఇందులో అనన్య పాండే హీరోయిన్.