నటిపై లైంగిక వేధింపుల ఆరోపణలు.. విచారణకు హాజరైన దర్శకుడు అనురాగ్ కశ్యప్
- అనురాగ్ కశ్యప్‌పై నటి పాయల్ ఘోష్ ఫిర్యాదు
- దర్శకుడికి సమన్లు
- ముంబైలోని వెర్సోవా పీఎస్‌కు వచ్చిన కశ్యప్
ఇటీవల ఆమె మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారికి కూడా ఫిర్యాదు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కార్యాలయానికీ ఆమె ఫిర్యాదు చేశారు. దీంతో అనురాగ్ కశ్యప్‌కు పోలీసులు సమన్లు పంపినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో అనురాగ్ కశ్యప్ ఈ రోజు ముంబైలోని వెర్సోవా పోలీసు స్టేషన్‌కు వచ్చారు. పోలీసులకు ఆయన ఈ కేసుపై వివరణ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. కాగా, పాయల్ ఘోష్‌కు పలువురు సినీ ప్రముఖుల నుంచి మద్దతు వచ్చిన విషయం తెలిసిందే.