అదంతా నిజం కాదంటున్న మాధవన్!
- అల్లు అర్జున్ నటిస్తున్న తాజా చిత్రం 'పుష్ప'
- లాక్ డౌన్ కారణంగా ఆగిన షూటింగ్
- విలన్ పాత్రలో మాధవన్ అంటూ ప్రచారం
- సోషల్ మీడియా ద్వారా ఖండించిన నటుడు
ఇదిలావుంచితే, ఇందులో విలన్ పాత్రను ఫలానా నటుడు పోషిస్తాడంటూ మొదటి నుంచీ రకరకాల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. ఆ క్రమంలో ప్రముఖ నటుడు మాధవన్ పేరు ఇటీవల వార్తలలోకి వచ్చింది. ఆయన ఏకంగా ఈ చిత్రానికి సంతకం కూడా చేసేశారంటూ వార్తలొచ్చాయి.
తాజాగా ఈ విషయం మాధవన్ దృష్టికి వెళ్లడంతో ఆయన స్పందించారు. ఈ వార్తలలో ఏమాత్రం వాస్తవం లేదని మాధవన్ షోషల్ మీడియా ద్వారా పేర్కొన్నాడు. దీంతో ఇక ఈ ప్రచారానికి ఫుల్ స్టాప్ పడుతుందనుకోవాలి.