డ్రగ్స్ సిండికేట్ లో సుశాంత్ ప్రియురాలు రియాదే కీలక పాత్ర: ఎన్సీబీ
- సుశాంత్ కు డ్రగ్స్ ఇచ్చింది ఆమే
- డ్రగ్స్ సిండికేట్ లో యాక్టివ్ గా ఉండే రియా
- ఆమె ఇంట్లో మాదకద్రవ్యాలను దాచుకుంది
- బెయిల్ ఇవ్వరాదని హైకోర్టులో ఎన్సీబీ అఫిడవిట్
రియా మొబైల్, ల్యాప్ టాప్, హార్డ్ డిస్క్ లో మాదకద్రవ్యాల సరఫరాకు సంబంధించిన ఎన్నో ఆధారాలు ఉన్నాయని, కేసు విచారణ జరుగుతున్న దశలో బెయిల్ ను మంజూరు చేస్తే, బయటకు వచ్చి సాక్ష్యాలను నాశనం చేసే అవకాశాలు ఉన్నాయని, బెయిల్ ఇవ్వరాదని కోరింది. రియా చక్రవర్తి తరచుగా డ్రగ్స్ సరఫరాదారులతో మాట్లాడుతూ, వారితో సంబంధాలు కొనసాగించారని కూడా ఎన్సీబీ తన అఫిడవిట్ లో స్పష్టం చేసింది. సుశాంత్ సింగ్ డ్రగ్స్ వాడతాడన్న సంగతి రియాకు తెలుసునని, అతనికి పలుమార్లు వాటిని అందించింది కూడా ఆమేనని పేర్కొంది. తన ఇంటిలో ఆమె డ్రగ్స్ ను దాచి పెట్టినట్టు కూడా తమ వద్ద ఆధారాలు ఉన్నాయని స్పష్టం చేసింది.
సుశాంత్ తో పాటు సమాజంలో పేరు ప్రతిష్ఠలున్న ఎంతో మందికి రియా స్వయంగా మత్తు మందులు అందించిందని, డ్రగ్స్ సిండికేట్ లో ఆమె ఓ యాక్టివ్ మెంబర్ అని, ముంబైకి డ్రగ్స్ తెచ్చే ఎంతో మందితో ఆమెకు సంబంధాలు ఉన్నాయని కోర్టుకు తెలిపింది. ఇందుకు సంబంధించిన చెల్లింపులన్నీ క్రెడిట్ కార్డులు, పేమెంట్ గేట్ వేల మాధ్యమంగా జరిగాయని, పలుమార్లు నగదును కూడా ఆమె చెల్లించిందని తెలుపుతూ, బెయిల్ ఇవ్వరాదని విజ్ఞప్తి చేసింది.