లాయర్ తర్వాత లెక్చరర్ పాత్రలో పవన్ కల్యాణ్?
- 'వకీల్ సాబ్'లో లాయర్ పాత్రలో పవన్
- హరీశ్ శంకర్ సినిమాలో లెక్చరర్ పాత్ర
- ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు
మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించే ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం జోరుగా జరుగుతున్నాయి. ఇక ఇందులో పవన్ ఎటువంటి పాత్ర పోషిస్తారనేది అభిమానులకు ఆసక్తిని కలిగించే అంశం. ఈ సినిమాలో ఆయన కాలేజీ లెక్చరర్ పాత్రను పోషిస్తారన్నది తాజా సమాచారం. ఈ పాత్ర చాలా గమ్మత్తుగా సాగుతుందని అంటున్నారు.
మరోపక్క, ప్రస్తుతం వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పవన్ హీరోగా 'వకీల్ సాబ్' చిత్రం రూపొందుతున్న సంగతి విదితమే. ఇందులో పవన్ లాయర్ పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన తాజా షెడ్యూల్ షూటింగులో పవన్ త్వరలో పాల్గొంటారు. హిందీలో హిట్టయిన 'పింక్' చిత్రం ఆధారంగా ఇది తెరకెక్కుతోంది. ఇక దీని తర్వాత పవన్ క్రిష్ సినిమా, ఆ తర్వాత హరీశ్ శంకర్ సినిమా చేస్తారని అంటున్నారు.