విచారించిన నలుగురు హీరోయిన్లదీ ఒకే మాట: నార్కోటిక్స్ బ్యూరో
- దీపిక, రకుల్, సారా అలీ ఖాన్, శ్రద్ధా కపూర్
- సిగరెట్లు కూడా ముట్టమని చెప్పిన వైనం
- మొబైల్ ఫోన్లు అప్పగించారన్న ఎన్సీబీ
సుశాంత్ సింగ్ డ్రగ్స్ తీసుకుంటాడని తమకు తెలియదని అందరూ స్టేట్ మెంట్ ఇచ్చారని, అతనితో పెద్దగా పరిచయం కూడా లేదని స్పష్టం చేశారని ఎన్సీబీ అధికారి తెలిపారు. వారి మొబైల్ ఫోన్లను సాంకేతికంగా విశ్లేషించేందుకే తీసుకున్నామని, వారంతట వారే తమ ఫోన్లను ఇచ్చారే తప్ప, బలవంతంగా తీసుకోలేదని స్పష్టం చేశారు.
ఇక ఈ కేసులో క్షితిజ్ రవి ప్రసాద్ అత్యంత కీలకమైన వ్యక్తని ఎన్సీబీ భావిస్తోంది. డ్రగ్స్ సిండికేట్ తో అతనికి సంబంధాలు ఉన్నందునే కస్టడీకి తీసుకున్నామని పేర్కొంది. ఈ కేసులో రియా చక్రవర్తి సహా 20 మందిని అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.