మీడియా కథనాలపై ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన రకుల్ ప్రీత్ సింగ్
- డ్రగ్స్ కేసులో రకుల్ పేరు
- ముంబయిలో రకుల్ ను విచారించిన ఎన్సీబీ అధికారులు
- తనపై కథనాలను అడ్డుకోవాలంటూ కోర్టును కోరిన రకుల్
తనకు వ్యతిరేకంగా పత్రికల్లోనూ, టీవీ చానళ్లలోనూ జరుగుతున్న ప్రచారాన్ని ఆపు చేయిస్తూ మధ్యంతర ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ రకుల్ ప్రీత్ న్యాయస్థానాన్ని కోరారు. సినిమా షూటింగ్ కోసం హైదరాబాదులో ఉన్న తాను మీడియాలో వస్తున్న కథనాలను చూసి దిగ్భ్రాంతి చెందానని వివరించారు. ఈ పిటిషన్ ను న్యాయస్థానం మరో వారంలో విచారణకు తీసుకురానుంది.