ఆయనతో కలసి నటిస్తున్నాను అని తెలియగానే ఎగిరి గంతేశా: నివేదా థామస్
- రజనీకాంత్ తో నటించడం నా అదృష్ణం
- ఆయన చాలా చురుకుగా ఉంటారు
- అందరితో స్నేహపూర్వకంగా ఉంటారు
తన ట్విట్టర్ పేజ్ లో ఆమె స్పందిస్తూ... రజనీ చాలా చురుకుగా ఉంటారని కితాబిచ్చింది. సహ నటీనటులతో మాట్లాడుతూ, ఆయన ఎప్పుడూ సంతోషంగా ఉంటారని చెప్పింది. తాను తొలిరోజు షూటింగ్ కు హాజరైనప్పుడు రజనీకాంత్ అన్న మాటలు తనకు ఆశ్చర్యాన్ని కలిగించాయని... 'ఈ అమ్మాయేనా? ఈమె నటించిన సినిమాలు చాలా చూశాను. బాగా యాక్ట్ చేస్తుంది' అని రజనీ చెప్పారని తెలిపింది. అందరితో ఆయన ఎంతో స్నేహపూర్వకంగా ఉంటారని చెప్పింది. ఆయనతో నటిస్తే ఎంతో గుర్తింపు వస్తుందని తెలిపింది.