తొమ్మిదేళ్ల నాటి సినిమా వివాదం.. 28న హాజరు కావాలంటూ నటుడు ఆర్యకు కోర్టు నోటీసులు!
- 9 ఏళ్ల క్రితం వచ్చిన ‘అవన్ ఇవన్’
- హిందూ దేవుళ్లు, సింగంపట్టి జమీందార్‌లను కించపరిచే సన్నివేశాలు
- తాజాగా పిటిషన్‌ను విచారించిన కోర్టు
సినిమాలో హిందూ దేవుళ్లు, సోరిముత్తు అయ్యనార్, సింగంపట్టి జమిందార్‌లను కించపరిచే సన్నివేశాలు ఉన్నాయని ఆరోపిస్తూ దర్శకుడు బాల, ఆర్యలపై పిటిషనర్ అప్పట్లో కోర్టుకెక్కాడు. శుక్రవారం ఈ పిటిషన్‌ను విచారించిన కోర్టు ఈ నెల 28న తమ ఎదుట హాజరు కావాలంటూ ఆర్యకు నోటీసులు జారీ చేసింది.
అవన్ ఇవన్ సినిమాకు బాల దర్శకత్వం వహించగా, విశాల్, ఆర్య ప్రధాన పాత్రల్లో నటించారు. కాగా, ఈ కేసును కొట్టివేయాలంటూ 2018లో మద్రాస్ హైకోర్టులోని మదురై బెంచ్‌ను ఆర్య ఆశ్రయించాడు.