సీసీ ఫుటేజ్‌లు ఏమయ్యాయి? ఎవరిని రక్షించడం కోసం ఈ ప్రయత్నాలు?: దేవినేని ఉమ
- ఏప్రిల్ 13న రథంపై సింహాలున్నాయి
- చోరీ జరిగిందని తెలిసినా ఫిర్యాదు ఎందుకు చేయలేదు?
- బాధ్యులైన మంత్రి, అధికారులపై చర్యలు ఎందుకు తీసుకోలేదు?
మార్చి 15న రథానికి మెరుగు పెట్టినప్పుడు నాలుగు సింహాలు ఉన్నాయని... ఇప్పుడు సింహాలు మాయమైన తర్వాత చోరీ విషయం తెలిసినా మూడు రోజులు ఎందుకు ఫిర్యాదు చేయలేదని నిలదీశారు. దేవాలయంలోని సీసీటీవీ ఫుటేజీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ఎవరిని రక్షించడం కోసం ఇదంతా చేస్తున్నారని అడిగారు. దీనికి బాధ్యులైన మంత్రి, అధికారులపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.