నటుడు విజయ్ దేవరకొండకు తమిళ చిత్ర నిర్మాణ సంస్థ క్షమాపణలు
- డస్కీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పేరుతో ఇటీవల ఆడిషన్స్
- పలువురు హీరోయిన్లను సంప్రదించి ఒత్తిడి
- ఓ ఏజెన్సీ నిర్వాకం వల్లే ఇలా జరిగిందంటూ క్షమాపణ
ఆ నిర్మాణ సంస్థతో తాము ఎటువంటి సినిమా చేయడం లేదని విజయ్ బృందం ధ్రువీకరించింది. అంతేకాదు, విజయ్ పేరును వాడుకుంటున్న నిర్మాణ సంస్థపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. దీంతో స్పందించిన డస్కీ ఎంటర్‌టైన్‌మెంట్స్ విజయ్‌కు క్షమాపణలు చెప్పింది. తమ ప్రమేయం లేకుండా ఓ ఏజెన్సీ చేసిన నిర్వాకం వల్ల తమ సంస్థ పేరు బయటకు వచ్చినట్టు తెలిపింది. తప్పుడు ఆడిషన్స్‌కు కారణమైన పలువురు ఉద్యోగులపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూసుకుంటామని హామీ ఇచ్చింది.