హైకోర్టు స్టే ఇవ్వడంపై నేను ఎలాంటి వ్యాఖ్యలు చేయను: బొత్స
- అమరావతిలో తప్పులు జరిగాయి
- ఆధారాలతోనే ఏసీబీ కేసులు పెట్టింది
- దమ్ముంటే విచారణ చేయాలని గతంలో టీడీపీ సవాల్ విసిరింది
టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేశ్, వారి తాబేదారులు అందరూ కేసులో ఉన్నారని అన్నారు. దమ్ముంటే విచారణ చేయండని గతంలో వారు సవాల్ విసిరారని... ఇప్పుడు మళ్లీ కోర్టుకు ఎందుకు వెళ్తున్నారని ప్రశ్నించారు. సిట్ విచారణపై హైకోర్టు ఏ విధంగా స్టే ఇచ్చిందనే దానిపై తాను కామెంట్ చేయబోనని చెప్పారు.