జయాబచ్చన్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన 'రేసుగుర్రం' విలన్!
- పార్లమెంటులో బాలీవుడ్ డ్రగ్స్ వ్యవహారంపై రచ్చ
- సినీ పరిశ్రమను నాశనం చేస్తున్నారన్న రవికిషన్
- పరిశ్రమను కాపాడుకోవాలని హితవు
జయ వ్యాఖ్యలపై రవికిషన్ అదే స్థాయిలో పార్లమెంటు బయట మీడియాతో మాట్లాడుతూ మండిపడ్డారు. తన అభిప్రాయాన్ని జయాబచ్చన్ గౌరవించాలని చెప్పారు. తాను ఒక ప్రీస్ట్ కుమారుడినని... ఎంతో కష్టపడి ఇండస్ట్రీలో ఎదిగానని, దాదాపు 600 సినిమాలకు పని చేశానని అన్నారు. తన అభిప్రాయాలకు జయ మద్దతు ఇస్తారని భావిస్తున్నానని చెప్పారు. ప్రపంచంలోనే అతి పెద్ద ఫిల్మ్ ఇండస్ట్రీని నాశనం చేస్తున్న వారి గురించి తాను మాట్లాడానని తెలిపారు. పరిశ్రమను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని చెప్పారు. రవికిషన్ భోజ్ పురి సూపర్ స్టార్ అనే విషయం అందరికీ తెలిసిందే. ఇదే సమయంలో తెలుగులో 'రేసుగుర్రం' చిత్రంతో మంచి పేరు తెచ్చుకున్నారు.