సీపీఐ నేత చాడ వెంకట్‌రెడ్డి వాహనంపై రాళ్ల దాడి!
- పార్టీ కార్యాలయం వద్ద పార్కింగ్ లో ఉన్న చాడ కారు
- రాళ్లు రువ్విన ఇద్దరు దుండగులు
- ఆరెస్సెస్ వాళ్లే ఈ పనికి పాల్పడి ఉండొచ్చన్న చాడ
దాడి జరిగిన సమయంలో చాడ తన నివాసంలో ఉన్నారు. లోక్ సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ తెలంగాణ కొత్త రెవెన్యూ చట్టంపై నిర్వహిస్తున్న ఆన్ లైన్ సదస్సులో ఆయన పాల్గొంటున్నారు. ఈ సమయంలో తన వాహనంపై దాడి జరిగిందనే విషయాన్ని తెలుసుకున్న చాడ... వెంటనే సదస్సును ముగించుకుని పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జరిగిన ఘటనను ఖండించారు. ఆరెస్సెస్ భావజాలం ఉన్నవారే ఈ పనికి పాల్పడి ఉంటారనే అనుమానాన్ని వ్యక్తం చేశారు.