ఆ ఐదుగురూ మా దగ్గరే ఉన్నారు.. ఎట్టకేలకు అంగీకరించిన చైనా
- మెక్‌మెహన్ రేఖ వద్ద పొరపాటున చైనా భూభాగంలోకి
- ఐదుగురిని అదుపులోకి తీసుకున్న చైనా ఆర్మీ
- హాట్‌లైన్ ద్వారా భారత ఆర్మీకి సమాచారం
అయితే, తాజాగా వారి విషయంలో చైనా ప్రకటన చేసింది. ఆ ఐదుగురు తమ వద్దే ఉన్నారని అంగీకరించింది. వారు తమ భూభాగంలో కనిపించడంతో అదుపులోకి తీసుకున్నట్టు తెలిపింది. ఈ మేరకు మంగళవారం తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో హాట్‌లైన్ ద్వారా భారత సైనికులకు సమాచారం చేరవేసింది. ఈ విషయాన్ని అరుణాచల్ ప్రదేశ్ ఎంపీ, కేంద్ర సహాయమంత్రి కిరణ్ రిజుజు ట్విట్టర్ ద్వారా తెలిపారు.
చైనా అదుపులో ఉన్న ఆ ఐదుగురిని వెనక్కి తీసుకొచ్చేందుకు చర్చలు జరుపుతున్నట్టు తెలిపారు. కాగా, మెక్‌మెహన్ రేఖ వద్ద సరిహద్దు విషయంలో స్పష్టత లేకపోవడం, ఆ ప్రాంతమంతా దట్టమైన అటవీప్రాంతం కావడంతో రెండువైపుల ప్రజలు తరచూ ఇతర దేశాల భూభాగంలోకి వెళ్తుండడం చాలా సాధారణ విషయమని సైన్యం తెలిపింది.