దీపిక ప్లానింగ్.. జస్ట్ మూడు రోజులలో పది వాణిజ్య చిత్రాలు!
- లాక్ డౌన్ వల్ల పెండింగులో షూటింగులు
- దీపిక చేతిలో పలు సినిమాలు, బ్రాండింగులు
- యాడ్స్ పూర్తిచేసి, షూటింగుకి గోవాకి పయనం
ఆమె పలు సినిమాలతో పాటు పలు ఉత్పత్తులకు ప్రచారకర్తగా వ్యవహరిస్తోంది. ఈ లాక్ డౌన్ కారణంగా పలు ఉత్పత్తుల ప్రచారం కోసం చేయాల్సిన షూటింగులు కూడా పెండింగ్ పడిపోయాయట. దాంతో ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు వరుసగా ఈ షూటింగులకు హాజరుకావడానికి సమాయత్తమవుతోంది.
ఈ క్రమంలో తన మేనేజ్ మెంట్ బృందంతో కలసి చర్చించి మూడు రోజుల్లో మొత్తం పది యాడ్ ఫిలింల షూటింగులను పూర్తిచేసేయాలని నిర్ణయించుకుందట. ముంబైలోని స్టూడియోలో వీటిని ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. ఇక ఈ చిత్రీకరణ పూర్తయిన వెంటనే అమ్మడు గోవాకి వెళ్లి శకున్ బాత్రా దర్శకత్వంలో రూపొందే చిత్రం షూటింగులో జాయిన్ అవుతుంది.