సుశాంత్ కేసులో మరో ట్విస్ట్.. ప్రియాంకపై ఫోర్జరీ కేసు పెట్టిన రియా చక్రవర్తి!
- సుశాంత్ సోదరిపై ముంబై పోలీసులకు ఫిర్యాదు
- బోగస్ మెడికల్ ప్రిస్క్రిప్షన్ ఇచ్చారని ఆరోపణ
- ప్రియాంక, డాక్టర్ తరుణ్ లను విచారించాలని విన్నపం
బోగస్ ప్రిస్క్రిప్షన్ లతో సుశాంత్ కు వైద్యం చేశారని... ఈ నేపథ్యంలో ప్రియాంక, తరుణ్ తదితరులను విచారించాల్సిన అవసరం ఉందని రియా తెలిపింది. రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రి ఔట్ పేషెంట్ గా సుశాంత్ కు బోగస్ ప్రిస్క్రిప్షన్ ఇచ్చారని... ఆ ప్రిస్క్రిప్షన్ ఇచ్చిన జూన్ 8వ తేదీన సుశాంత్ ముంబైలోనే ఉన్నాడని ఫిర్యాదులో పేర్కొంది.