ఆ నలుగురు హీరోలు డ్రగ్స్ వాడతారని చెప్పుకుంటున్నారు: బాంబు పేల్చిన కంగనా రనౌత్
- రణవీర్, రణబీర్, అయాన్, విక్కీలు కొకైన్ వాడతారనే ప్రచారం ఉంది
- వారు డ్రగ్ టెస్ట్ చేయించుకోవాలి
- వారిపై పడ్డ అపవాదును తొలగించుకోవాలి
వీరు నలుగురూ కొకైన్ వాడతారనే ప్రచారం బాలీవుడ్ లో ఉందని కంగన తెలిపింది. డ్రగ్ టెస్ట్ చేయించుకుని... తమపై పడిన అపవాదును వారు తొలగించుకోవాలని చెప్పింది. రక్త పరీక్షల్లో వారికి క్లీన్ రిపోర్ట్ వస్తే లక్షలాది మందికి స్ఫూర్తిదాతలుగా అవతరిస్తారని తెలిపింది. అంతే కాదు ... ఈ ట్వీట్ ను ప్రధాని మోదీ కార్యాలయానికి కూడా ట్యాగ్ చేసింది.