మేం యువత... మాకు కరోనా ఏంవస్తుందిలే అనుకోవద్దు: తమిళిసై వార్నింగ్
- 45 ఏళ్ల లోపు వారికి వైరస్ ముప్పు ఎక్కువని వెల్లడి
- వెంటనే డాక్టర్లను సంప్రదించాలన్న తమిళిసై
- కరోనా ఎవరికైనా వస్తుందని స్పష్టీకరణ
కరోనా వ్యాప్తి మొదలైన తొలినాళ్లలో... 60 ఏళ్లు పైబడినవారు జాగ్రత్తగా ఉండాలని, యువతకు వ్యాధి నిరోధక శక్తి మెండుగా ఉండడంతో వారికి ఈ వైరస్ సోకే అవకాశాలు తక్కువని ప్రచారం జరిగింది. అయితే, ఇటీవల వస్తున్న నివేదికల్లో యువతలోనే కరోనా పాజిటివ్ కేసులు అధికంగా వస్తున్నట్టు వెల్లడైంది. ఈ నేపథ్యంలో గవర్నర్ తమిళిసై హెచ్చరించారు.