తిరిగి తిరిగి ఆ పాత్ర చివరికి టబు వద్దకే వచ్చిందట!
- నితిన్ తో తెలుగులో 'అందాధున్' రీమేక్
- హిందీలో కీలక పాత్ర పోషించిన టబు
- ప్రచారంలో శ్రియ, ఇలియానా నయనతారల పేర్లు
- చివరికి మళ్లీ టబునే సంప్రదిస్తున్న యూనిట్
ఈ చిత్రం హిందీ వెర్షన్ లో టబు ఓ కీలక పాత్ర పోషించింది. తెలుగులో కూడా ఆ పాత్రను ఆమెతోనే చేయించాలని మొదట్లో అనుకున్నారు. అయితే, ఎందుకో అది కుదరలేదు. ఆ తర్వాత ఆ పాత్రకు శియాను అనుకున్నారు.. తర్వాత ఇలియానా పేరు వచ్చింది. తర్వాత ప్రియమణి.. ఆ తర్వాత నయనతారను అనుకున్నారు.
ఇక నయనతార ఎంపిక పూర్తయిపోయిందని ప్రచారం కూడా జరిగింది. అయితే, ఆమె పారితోషికం ఎక్కువ అడగడంతో చివరికి ఓకే కాలేదట. ఆఖరికి ఇప్పుడు తిరిగి మళ్లీ టబుతోనే చిత్రం యూనిట్ సంప్రదింపులు జరుపుతోందని తెలుస్తోంది. పైగా, ఆమె ఆ పాత్ర ఇప్పటికే హిందీలో చేసి వుండడం వల్ల ఆమె బాగా సరిపోతుందని కూడా భావిస్తున్నారు.