ఆన్‌లైన్ విద్యాబోధన మంచిదే కానీ.. వారికి ఉచితంగా ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌ఫోన్లు ఇవ్వాలి: ఆర్.కృష్ణయ్య డిమాండ్
- ఆన్‌లైన్ విద్యాబోధనను స్వాగతించిన కృష్ణయ్య
- గ్రామీణ, మురికివాడల్లోని పిల్లలకు ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌ఫోన్లు లేవు
- ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవ తీసుకోవాలి
ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్టు చెప్పిన కృష్ణయ్య, మారుమూల, గిరిజన, పట్టణాల్లోని మురికివాడల్లో నివసిస్తున్న లక్షలాదిమందికి ల్యాప్‌టాప్, స్మార్ట్‌ఫోన్లు అందుబాటులో లేవని, దీంతో వారు ఆన్‌లైన్ పాఠాలు కోల్పోయే అవకాశం ఉందన్నారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవ తీసుకోవాలని కోరారు. పేద విద్యార్థులు విద్యాసంవత్సరాన్ని నష్టపోకుండా ఉండాలంటే వారికి వెంటనే ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌ఫోన్లు పంపిణీ చేయాలని కృష్ణయ్య కోరారు.