ఎంపీ సంతోష్ పేరిట ఫేక్ ఫేస్ బుక్ ఐడీతో మోసాలకు పాల్పడున్న మైనర్ బాలుడి అరెస్ట్
- నకిలీ ఐడీతో యూపీ బాలుడి మోసాలు
- డబ్బు కావాలంటూ మాదాపూర్ యువకుడికి సందేశం
- అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసిన యువకుడు
ఆపై తనకు డబ్బు కావాలంటూ మెసేజ్ పంపడంతో పాటు ఫోన్ ద్వారానూ మాట్లాడాడు. దాంతో ఆ యువకుడికి అనుమానం వచ్చింది. ఓ ఎంపీ అయ్యుండి తనను డబ్బు అడగడం ఏంటని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దాంతో ఆ మోసగాడి బండారం బట్టబయలైంది. సైబరాబాద్ పోలీసులు కేసు విచారించగా, ఉత్తరప్రదేశ్ కు చెందిన బాలుడని తేలింది. అతడ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు, గతంలో ఏమైనా మోసాలకు పాల్పడ్డాడా? అనే కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.