Varun Tej: వరుణ్ తేజ్ కోసం పోలీస్ స్టోరీ సిద్ధం!

Varun Tej to play police officer in his next

  • మన హీరోలకు పోలీస్ పాత్రలపై క్రేజ్
  • సాగరచంద్రకు ఓకే చెప్పిన వరుణ్
  • వచ్చే ఏడాది షూటింగ్ ప్రారంభం

సినిమా హీరోలకు పోలీస్ పాత్రలంటే వుండే క్రేజే వేరు. అందులోనూ పవర్ ఫుల్ పోలీసాఫీసర్ పాత్ర అంటే తెగ మక్కువ చూపిస్తారు. ఆ పాత్ర ద్వారా చూపించే యాక్షన్ సీన్స్, అవినీతిని వ్యతిరేకించే పద్ధతి, అక్రమార్కుల భరతం పట్టే సీన్లు, పేదల తరఫున పోరాడే తత్త్వం.. వంటివన్నీ ప్రేక్షకులకు బాగా పడతాయనీ, తద్వారా తమ ఇమేజ్ పెరుగుతుందనీ హీరోలు భావిస్తుంటారు. అందుకే, కనీసం ఒక్క పోలీస్ పాత్రనైనా చేయాలని ఉవ్విళ్లూరుతుంటారు. ఇలాంటి పాత్ర చేయాలనే కోరిక మెగా హీరో వరుణ్ తేజ్ కు కూడా వుంది. అది త్వరలో సాకారం కాబోతోంది.

వరుణ్ కోసం దర్శకుడు సాగరచంద్ర ఓ పవర ఫుల్ పోలీసాఫీసర్ పాత్రతో కూడిన కథను సిద్ధం చేశాడట. అది వరుణ్ కి బాగా నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని అంటున్నారు. వాస్తవానికి ఈ చిత్రం ఇంతకుముందే సెట్స్ కి వెళ్లాలి. వేరే కారణాల వల్ల ఆలస్యమైందంటున్నారు. ప్రస్తుతం వరుణ్ స్పోర్ట్స్ డ్రామా 'బాక్సింగ్' చేస్తున్నాడు. దీని తర్వాత అనిల్ రావిపూడితో 'ఎఫ్ 3' చేయాల్సివుంది. దాని తర్వాత వచ్చే ఏడాది ఈ పోలీస్ స్టోరీ సెట్స్ కి వెళుతుందట. దీనిని '14 రీల్స్ ప్లస్' బ్యానర్ పై భారీ చిత్రంగా నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నారు.    

Varun Tej
Police
Sagarachandra
Anil Ravipoodi
  • Loading...

More Telugu News