అనుష్కకు ఐదో నెల... జనవరిలో ముగ్గురం అవబోతున్నామని శుభవార్త చెప్పిన కోహ్లీ!
- నెరవేరనున్న విరుష్క దంపతుల కల
- జనవరి 2021లో డెలివరీ
- ట్విట్టర్ లో స్వయంగా వెల్లడించిన కోహ్లీ
"ఇప్పుడిక మేము ముగ్గురం... జనవరి 2021లో రాక" అని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ కు అనుష్కతో ఉన్న ఫోటోను విరాట్ జతచేశారు. ఇందులో అనుష్క బేబీ బంప్ స్పష్టంగా కనిపిస్తోంది. ఈ ట్వీట్ క్షణాల్లో వైరల్ అయింది. వేలాది లైక్స్ వచ్చాయి. ఎంతో మంది ఫ్యాన్స్, సెలబ్రిటీలు విరుష్క దంపతులకు శుభాభినందనలు చెబుతున్నారు. జనవరిలో డెలివరీ ఉన్నదంటే, ఇప్పుడు ఐదో నెల జరుగుతున్నట్టని, ముందే ఎందుకు చెప్పలేదని ఆప్యాయంగా ప్రశ్నిస్తూ, బిడ్డ ఎమోజీలతో హోరెత్తిస్తున్నారు.