ప్రభాస్ సినిమా 'ఆదిపురుష్' గురించి నాకు ముందే తెలుసు: రాజమౌళి
- 'ఆదిపురుష్' గురించి ప్రభాస్ నాకు మందే చెప్పాడు
- సినిమా పోస్టర్ ను కూడా ముందే చూపించాడు
- ఈ సినిమా ప్రభాస్ స్థాయిని మరింత పెంచుతుంది
'ఆదిపురుష్' చిత్రం గురించి తనకు ముందే తెలుసని రాజమౌళి చెప్పారు. ఈ సినిమా పోస్టర్ ను కూడా తాను ముందే చూశానని... ప్రభాస్ తనకు దాన్ని చూపించాడని తెలిపారు. అయోధ్యలో రామమందిర నిర్మాణం జరుగుతున్న సమయంలోనే... ఈ చిత్రం తెరకెక్కుతుండటం అద్భుతమని చెప్పారు. ఈ సినిమా ప్రభాస్ స్థాయిని 'బాహుబలి' కంటే ఎక్కువగా పెంచుతుందని అన్నారు.