త్వరలో మోహన్ బాబు కొత్త పాత్ర.. దర్శకుడిగా మారుతున్న వైనం!
- నటుడిగా మోహన్ బాబుది ప్రత్యేక స్థానం
- విలన్ గా, హీరోగా పాత్రలపై తనదైన ముద్ర
- ఆయన కూడా నటిస్తారా? అన్నది ఆసక్తికరం
ఇందుకోసం అప్పుడే ఆయన ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నట్టు చెబుతున్నారు. ఈ ప్రాజక్టుకు సంబంధించిన కథను ఇప్పటికే ఆయన రెడీ చేయించినట్టు సమాచారం. అయితే, ఇందులో ఎవరు నటిస్తారు? మోహన్ బాబు కూడా నటిస్తారా? అన్నది ఇంకా వెల్లడి కాలేదు. ఇక, అసలు మోహన్ బాబు కెరీర్ దర్శకత్వ శాఖ ద్వారానే జరిగింది. పలు సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు. తర్వాత ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు ఈయనని 'స్వర్గం నరకం' సినిమా ద్వారా విలన్ గా పరిచయం చేశారు. ఆ తర్వాత కథ మనకు తెలిసిందే.