'ఎఫ్ 2' సీక్వెల్ పై స్పష్టత నిచ్చిన వెంకటేశ్!
- ప్రభుత్వం ఓకే చెప్పినా మొదలవ్వని షూటింగులు
- కరోనాకు జంకుతున్న పెద్ద హీరోలు
- ఈ ఏడాది షూటింగులు కేన్సిల్ చేసిన వెంకీ
- సంక్రాంతి తర్వాతే 'ఎఫ్ 2' సీక్వెల్ షూటింగ్
ఆయన నటిస్తున్న 'నారప్ప' చిత్రం షూటింగ్ చాలావరకు లాక్ డౌన్ కి ముందు అవుట్ డోర్ లో జరిగింది. అయితే, లాక్ డౌన్ రావడంతో ఎక్కడి షూటింగ్ అక్కడ ఆగిపోయింది. ఇక ఇప్పట్లో ఈ చిత్రం షూటింగును ప్రారంభించడానికి వెంకటేశ్ సంసిద్దంగా లేరని తెలుస్తోంది. అసలు ఈ ఏడాది చివరి వరకు సెట్స్ కి వెళ్లకూడదని ఆయన నిర్ణయించుకుని, యూనిట్ కి ఆ విషయం చెప్పేశారని కూడా అంటున్నారు. దీంతో, వెంకీ, వరుణ్ తేజ్ లతో అనిల్ రావిపూడి రూపొందించే 'ఎఫ్ 2' సీక్వెల్ షూటింగ్ కూడా వచ్చే ఏడాదికి పోస్ట్ పోన్ అయింది. సంక్రాంతి తర్వాత షూటింగ్ షెడ్యూల్స్ వేసుకోమని వెంకీ దర్శకుడు అనిల్ కి చెప్పారట.