'అర్జున్ రెడ్డి' కాంబినేషన్లో మరో ప్రాజక్టు!
- మూడేళ్ల క్రితం అర్జున్ రెడ్డి సంచలనం
- విజయ్ దేవరకొండని స్టార్ ని చేసిన సినిమా
- సందీప్ రెడ్డితో వెబ్ సీరీస్ నిర్మిస్తున్న విజయ్
- ఆనంద్ దేవరకొండ లీడ్ రోల్
ఇప్పుడు మళ్లీ విజయ్, సందీప్ కలుస్తున్నారు. అయితే, ఇది సినిమా కాదు.. ఇందులో విజయ్ నటించడమూ లేదు. 'కింగ్ ఆఫ్ ద హిల్' బ్యానర్ పై విజయ్ దేవరకొండ నిర్మించే వెబ్ సీరీస్ కి సందీప్ రెడ్డి దర్శకత్వం వహించనున్నాడని తెలుస్తోంది. ఇందులో విజయ్ సోదరుడు ఆనంద్ దేవరకొండ లీడ్ రోల్ పోషిస్తాడట. పూర్తి వివరాలు త్వరలో వెల్లడవుతాయి.