భూమి ఇచ్చే ప్రతి కుటుంబానికి ఉద్యోగం ఇవ్వాలి: కేటీఆర్
- ప్రపంచంలోనే పెద్ద ఫార్మా క్లస్టర్ గా ఫార్మా సిటీ రూపుదిద్దుకుంటోంది
- స్థానికుల ప్రయోజనాలకు పెద్దపీట వేయాలి
- వారి విద్యార్హతలను మ్యాపింగ్ చేయండి
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, స్థానికుల ప్రయోజనాలకు పెద్ద పీట వేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఫార్మా సిటీ కోసం భూములు ఇస్తున్న ప్రతి కుటుంబంలో కనీసం ఒకరికి ఉద్యోగం వచ్చేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఈ అంశానికి సంబంధించి ఇప్పటి నుంచే కసరత్తును ప్రారంభించాలని సూచించారు. ప్రభావిత కుటుంబాలకు సంబంధించి ఒక జాబితా తయారు చేయాలని... కుటుంబసభ్యుల విద్యార్హతలు, ఇతర టెక్నికల్ అర్హతలను మ్యాపింగ్ చేయాలని చెప్పారు. తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ తో పాటు, ఇతర శిక్షణా సంస్థల సహకారంతో ముందుకు పోవాలని చెప్పారు.