సినీ నటి సోనాక్షి సిన్హాపై సోషల్ మీడియాలో అసభ్య వ్యాఖ్యలు.. యువకుడి అరెస్ట్
- బాలీవుడ్ నటిపై ఔరంగాబాద్ యువకుడు అసభ్య పోస్టులు
- ముంబై సైబర్ క్రైం పోలీసులకు నటి కృతజ్ఞతలు
- ఆన్‌లైన్ మాధ్యమం సురక్షితంగా ఉండేంత వరకు తాను నిశ్శబ్దంగా ఉండబోనని వ్యాఖ్య
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో ఇటువంటి వాటిని తాను సహించబోనని తెలిపింది. ఆన్‌లైన్ మాధ్యమం సురక్షితంగా ఉండేంత వరకు తాను నిశ్శబ్దంగా ఉండలేనని పేర్కొంది. అందుకనే తాను పోలీసులకు ఫిర్యాదు చేశానని, వెంటనే స్పందించి చర్యలు తీసుకున్న ముంబై సైబర్ క్రైం పోలీసులకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానని పేర్కొంది. ఆన్‌లైన్ వేధింపులకు గురైన వారు ముంబై సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయాలని సోనాక్షి సూచించింది.