స్వయంగా వినాయకుడి కథ చెప్పి వీడియో రిలీజ్ చేసిన మోహన్ బాబు
- రేపు వినాయకచవితి
- తనకు బాగా ఇష్టమైన పండుగ ఇదేనన్న మోహన్ బాబు
- విష్ణు సూచన పాటించి వీడియో రూపొందించానని వెల్లడి
ప్రతి ఏడాది కుటుంబ సభ్యులతో పాటు కొందరు మిత్రులను కూడా ఇంటికి పిలిచి వినాయక చవితి మంత్రాలు, విఘ్వేశ్వరుడి కథ వినిపించడం తనకు అలవాటు అని, ఆ అలవాటును అందరికీ వినిపించాలని తన పెద్ద కుమారుడు విష్ణు సూచించాడని మోహన్ బాబు వెల్లడించారు. అందుకే ఓ వీడియోలో వినాయకుడి కథ చెప్పి, దాన్ని అందరికీ వినిపిస్తున్నానని వివరించారు. ఈ వీడియోను మంచు విష్ణు తన యూట్యూబ్ చానల్ లో పోస్టు చేశారు.