శబరి నదిలో ప్రమాదం.. రెండు ముక్కలైన లాంచీ.. ముగ్గురి గల్లంతు!
- తూర్పుగోదావరి జిల్లా చింతూరు వద్ద ఘటన
- లాంచీలో ఇతరులు ఎంతమంది ఉన్నారో అనే ఆందోళన
- ఘటనా స్థలానికి చేరుకున్న పోలీస్, రెవెన్యూ సిబ్బంది
ఈ ఘటనలో లాంచీకి సంబంధించిన ముగ్గురు వ్యక్తులు గల్లంతైనట్టు తెలుస్తోంది. మరోవైపు, ఆ సమయంలో లాంచీలో ఇంకెంత మంది ఉన్నారనే విషయంపై ఆందోళన నెలకొంది. చీకటిగా ఉండటంతో అక్కడి పరిస్థితి ఏమీ అర్థం కావడం లేదు. గత నాలుగైదు రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండటంతో వరద ఉద్ధృతి ఎక్కువగా ఉంది.