వెంకటేశ్ 75వ చిత్రానికి సన్నాహాలు.. త్రివిక్రమ్ దర్శకత్వం?
- వెంకటేశ్ చేస్తున్న 'నారప్ప' 74వ చిత్రం
- ఇప్పటికే కథను సిద్ధం చేసిన త్రివిక్రమ్
- ఎన్టీఆర్ తో కన్నా ముందుగానే వెంకీ సినిమా
ఇక ఈ చిత్రానికి సంబంధించిన కథను త్రివిక్రమ్ ఇప్పటికే సిద్ధం చేశారని అంటున్నారు. దీనికి వెంకీ ఎప్పుడో గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట. ప్రస్తుతం ఎన్టీఆర్ తో త్రివిక్రమ్ ఓ సినిమా చేయాల్సివుంది. అయితే, దానికి ఇంకా కాస్త సమయం ఉన్నందున ముందుగా వెంకీ చిత్రాన్ని త్రివిక్రమ్ ప్రారంభించనున్నట్టు తెలుస్తోంది. ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్టుతో నిర్మించడానికి ప్లాన్ చేస్తోందట. ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజక్టుకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడవుతాయి.