అమెరికాలో కరోనా చికిత్స విధానం ఏపీ కరోనా ప్రోటోకాల్ ఒకేలా ఉన్నాయి: వైసీపీ
- ఓ భారత సంతతి వైద్యురాలి వ్యాఖ్యల ఉటంకింపు
- అమెరికాలోనూ తాము ఇలాంటి విధానమే పాటిస్తామన్న వైద్యురాలు
- ఏపీ డాక్టర్ల పనితీరు భేష్ అంటూ కితాబు
ఈ సందర్భంగా ఆమె ఫోన్ ద్వారా ఓ భారత మీడియా సంస్థతో మాట్లాడుతూ, అమెరికాలో కరోనా విషయంలో తాము ఎలాంటి చికిత్సా పద్ధతులు వినియోగిస్తున్నామో, ఏపీలోనూ అలాంటి ప్రోటోకాల్ నే పాటిస్తున్నారని కొనియాడారు. ఓ రోగి ఆరోగ్యస్థితిని ఎంతో నిశితంగా పరిశీలిస్తుండడం, కీలక మార్పులను ఎప్పటికప్పుడు గమనిస్తుండడం ద్వారా పరిస్థితి విషమించకముందే జాగ్రత్త పడవచ్చని తెలిపారు. ఏపీలో కరోనా రోగులకు అందిస్తున్న చికిత్స ఈ పద్ధతిలోనే సాగుతుండడం అభినందనీయమని పేర్కొన్నారు.
అంతేకాదు, ఆసుపత్రిపాలైన కరోనా రోగులకు మొదట్లోనే రెమ్ డెసివిర్ ఇంజెక్షన్ ఇవ్వడం ఎంతో సత్ఫలితాలను ఇస్తుందని అన్నారు. శరీరంలో ఆక్సిజన్ శాతం తక్కువై, ఊపిరిత్తుల ఇన్ఫెక్షన్ అధికంగా ఉన్న సమయంలో ఈ ఇంజెక్షన్ ఎంతో సమర్థంగా పనిచేస్తుందని వివరించారు. అమెరికాలో కరోనా రోగులకు తాము విటమిన్ సి, జింక్, మెలటోనిన్, విటమిన్ డి మాత్రలు కూడా ఇస్తుంటామని, ఏపీలోనూ ఈ పద్దతి అమలు చేస్తున్నట్టు గుర్తించానని డాక్టర్ సుప్రియ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమె ఏపీలో డాక్టర్లు అందిస్తున్న సేవలు నిరుపమానం అని కొనియాడారు.