ఫేస్ బుక్ ను బీజేపీ నియంత్రిస్తోందన్న రాహుల్... ఓడిపోయిన వాళ్లు ఇలాగే నసుగుతుంటారన్న కేంద్రమంత్రి
- కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం
- విద్వేషాన్ని ప్రచారం చేస్తున్నారన్న రాహుల్
- పైత్యం తలకెక్కిందా? అంటూ రవిశంకర్ ప్రసాద్ వ్యాఖ్యలు
కాగా, రాహుల్ వ్యాఖ్యలపై కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ అదేస్థాయిలో స్పందించారు. కనీసం తమ సొంత అభిప్రాయాలతోనైనా ప్రజలను ఏమాత్రం ప్రభావితం చేయలేని పరాజితులు ఇలాగే నసుగుతూ ఉంటారని, యావత్ ప్రపంచాన్ని కూడా బీజేపీ, ఆర్ఎస్ఎస్ లే నియంత్రిస్తున్నాయని గగ్గోలు పెడుతుంటారని రవిశంకర్ ప్రసాద్ వ్యాఖ్యానించారు. "ఎన్నికల ముందు డేటాను అస్త్రంగా వాడుకునే ప్రయత్నంలో కేంబ్రిడ్జ్ ఎనలిటికా-ఫేస్ బుక్ లతో కలిసి రెడ్ హ్యాండెడ్ గా దొరికపోయావు. ఇప్పుడు మమ్మల్ని ప్రశ్నించేంతగా పైత్యం తలకెక్కిందా?" అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.