ప్రభాస్ తో యాక్షన్ థ్రిల్లర్ ప్లాన్ చేస్తున్న 'కేజీఎఫ్' దర్శకుడు!
- ప్రస్తుతం 'కేజీఎఫ్'కి సీక్వెల్ చేస్తున్న ప్రశాంత్ నీల్
- తదుపరి చిత్రం ఎన్టీఆర్ తో ప్లానింగ్
- ఇటీవల ప్రభాస్ ని కలసి చర్చించిన ప్రశాంత్
వీటిలో ముందుగా ఎన్టీఆర్ తో చేసే సినిమా ఒకటి కాగా, మరొకటి ప్రభాస్ తో చేసే చిత్రం. ఎన్టీఆర్ తో ఇటీవల చర్చలు జరిపిన దర్శకుడు ప్రశాంత్.. తాజాగా ప్రభాస్ తో కూడా ప్రాజక్టు గురించి చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. ప్రభాస్ కోసం ఓ భారీ యాక్షన్ థ్రిల్లర్ కథను ప్రశాంత్ సిద్ధం చేస్తున్నాడట. ఈ విషయంపైనే ఇటీవల ప్రభాస్ తో ఈ దర్శకుడు మాట్లాడినట్టు తెలుస్తోంది. తాను ఎన్టీఆర్ తో చేసిన చిత్రం తర్వాత ఈ చిత్రం సెట్స్ కి వెళుతుందని అంటున్నారు. అప్పటికి ప్రభాస్ ప్రస్తుతం కమిట్ అయిన సినిమాలను పూర్తి చేస్తాడు.