వరలక్ష్మి పూజను బాగా ఆస్వాదించాను... థాంక్స్ అత్తమ్మా!: ఉపాసన
- వరలక్ష్మి పూజ నిర్వహించిన ఉపాసన
- శ్రావణమాసం సందర్భంగా ప్రత్యేకపూజలు
- ఇది తనకెంతో ప్రత్యేకం అని పేర్కొన్న ఉపాసన
"వరలక్ష్మి అమ్మవారి పూజను నిజంగా ఎంతో ఆస్వాదించాను. అందుకు రామ్ చరణ్ కు, మా అత్తమ్మకు, డాక్టర్ సంగీతారెడ్డికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ పూజను ఎంతో ప్రత్యేకంగా మలిచినందుకు వారికి ధన్యవాదాలు. ఎంతో సంతృప్తిగా ఉంది. మనందరిపైనా ఆ వరలక్ష్మి అమ్మవారి కరుణాకటాక్షాలు ఉండాలని, సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు కలగాలని కోరుకుంటున్నాను" అంటూ ఉపాసన ట్వీట్ చేశారు.