తమిళ దర్శకుడితో మహేశ్ బాబు సినిమా?
- విజయ్ తో 'మాస్టర్' చేసిన లోకేశ్ కనగరాజ్
- మహేశ్ బాబుతో తాజాగా సంప్రదింపులు
- మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లో సినిమా
'సర్కారు వారి పాట' చిత్రాన్ని నిర్మిస్తున్న మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఇటీవలే లోకేశ్ కనగరాజ్ తో తెలుగు, తమిళ భాషల్లో ఓ చిత్రం చేయడానికి ఒప్పందం కుదుర్చుకుంది. అది మహేశ్ తో నిర్మించే చిత్రం కోసమేనని టాలీవుడ్ లో ప్రచారం జరుగుతోంది. మరోపక్క, రాజమౌళి దర్శకత్వంలో మహేశ్ ఓ సినిమా చేయాల్సివుంది. రాజమౌళి తదుపరి సినిమా మహేశ్ తోనే అన్న వార్త కూడా ఇప్పటికే అధికారికంగా వచ్చింది. అయితే, ఈ సినిమాకి కాస్త సమయం పట్టే అవకాశం ఉండడంతో, ఈ లోగా మహేశ్ తమిళ దర్శకుడు లోకేశ్ తో సినిమా పూర్తి చేస్తాడని అంటున్నారు.