ప్రభాస్ తో భారీ ప్రాజక్ట్ ప్లాన్ చేస్తున్న బాలీవుడ్ చిత్ర నిర్మాణ సంస్థ!
- 'సాహో' తర్వాత మరింత పెరిగిన ప్రభాస్ మార్కెట్
- ప్రభాస్ తో హిందీ సినిమా ప్లాన్ చేస్తున్న టీ-సీరీస్
- నాగ్ అశ్విన్ సినిమా తర్వాత సెట్స్ కి వెళ్లే ఛాన్స్
వాస్తవానికి ప్రభాస్ తో టీ-సీరీస్ అనుబంధం 'సాహో' చిత్రం నుంచీ కొనసాగుతోంది. ఆ చిత్రాన్ని టీ-సీరీస్ హిందీలో విడుదల చేసింది. ఇప్పుడు ప్రభాస్ నటిస్తున్న 'రాధే శ్యామ్' కూడా ఆ సంస్థే తీసుకుంది. దీంతో ప్రభాస్ తో భూషణ్ కుమార్ కి అనుబంధం ఏర్పడిందనీ, ఆ పరిచయంతో వాళ్లకి సినిమా చేయడానికి ఓకే చెప్పాడనీ అంటున్నారు. ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్టుతో నిర్మించాలని భూషణ్ కుమార్ ప్లాన్ చేస్తున్నాడట. త్వరలో నాగ్ అశ్విన్ తో చేయనున్న చిత్రం తర్వాత టీ- సీరీస్ నిర్మించే చిత్రం సెట్స్ కి వెళుతుందని సమాచారం.