మోహన్ బాబు ఇంట్లోకి దూసుకెళ్లిన కారు... మిమ్మల్ని వదలబోమంటూ హెచ్చరించిన దుండగులు
- మోహన్ బాబు నివాసం వద్ద కారు కలకలం
- ఇన్నోవా కారులో వచ్చిన నలుగురు వ్యక్తులు
- పోలీసులకు ఫిర్యాదు చేసిన మోహన్ బాబు కుటుంబ సభ్యులు
మోహన్ బాబు ఇంటి సెక్యూరిటీ సిబ్బంది ఆదమరిచి ఉన్న సమయంలో ఒక్కసారిగా ఇన్నోవా కారు ఆయన ఇంట్లోకి దూసుకెళ్లింది. అందులో నలుగురు వ్యక్తులు ఉన్నట్టు గుర్తించారు. వారు సీరియస్ వార్నింగ్ ఇచ్చిన పిమ్మట మళ్లీ అదే కారులో వెళ్లిపోయారు. ఈ ఘటనతో తీవ్ర ఆందోళనకు గురైన మోహన్ బాబు కుటుంబ సభ్యులు పహాడీ షరీఫ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మోహన్ బాబు ఇంటికి వెళ్లి మరీ హెచ్చరించింది ఎవరన్నది ఆసక్తికర అంశంగా మారింది.