చంద్రముఖి-2పై వస్తున్నవన్నీ ఫేక్ న్యూస్: రాఘవ లారెన్స్
- చంద్రముఖి-2 తెరకెక్కించేందుకు లారెన్స్ సన్నాహాలు
- జ్యోతిక, సిమ్రాన్, కియారా అంటూ పుకార్లు
- త్వరలోనే ప్రకటిస్తామన్న లారెన్స్
చంద్రముఖిలో ఫిమేల్ లీడ్ రోల్ కు సంబంధించి అనేక రూమర్లు వస్తున్నాయని, జ్యోతిక, సిమ్రాన్, కియరాల్లో ఒకరు చేస్తారని ప్రచారం జరుగుతోందని, అయితే ఇదంతా ఫేక్ న్యూస్ అని కొట్టిపారేశాడు. ప్రస్తుతం చంద్రముఖి-2 స్క్రిప్ట్ వర్క్ జరుగుతోందని, కరోనా పరిస్థితులు సద్దుమణిగాక ప్రధానపాత్రలో నటించే కథానాయిక ఎవరన్నది తేలుతుందని స్పష్టం చేశాడు. త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తామని లారెన్స్ సోషల్ మీడియాలో తెలిపాడు.