నిజంగా నీవు మహాత్ముడివి సోనూ: బ్రహ్మాజీ
- పేదలకు సాయం చేస్తూ నిజమైన హీరోలా నిలిచావు
- నీ సేవలను ప్రభుత్వం గుర్తించాలి
- నిన్ను పద్మభూషణ్ కు సిఫారసు చేయాలి
ఈరోజు సోనూసూద్ 47వ పుట్టినరోజు. ఈ సందర్భంగా సోనూకు సినీ నటుడు బ్రహ్మాజీ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు. 'మైడియర్ సోనూసూద్ హ్యాపీ బర్త్ డే. కష్టకాలంలో పేదలకు అండగా నిలుస్తూ నిజమైన హీరోలా నిలిచావు. నీ సేవలను ప్రభుత్వం గుర్తించాలని, పద్మభూషణ్ కు నిన్ను సిఫారసు చేయాలని కోరుకుంటున్నా. నిజంగా నీవు మహాత్ముడివి సోనూ' అంటూ తన అభిమానాన్ని వ్యక్తం చేశాడు.