కరోనా నుంచి కోలుకున్న వ్యక్తిని లైవ్ ఇంటర్వ్యూ చేయాలని శేఖర్ కమ్ముల నిర్ణయం
- ప్రజల్లో కరోనా పట్ల అపోహలున్నాయన్న శేఖర్ కమ్ముల
- మెరుగైన అవగాహన అవసరం అంటూ వ్యాఖ్యలు
- ఈ సాయంత్రం ఫేస్ బుక్ లో అవగాహన కార్యక్రమం
"కరోనాతో మనం చేసే పోరాటంలో అనేక భయాలు, అపోహలు, తప్పుడు సమాచారం కారణంగా అనవసరమైన ఆందోళన, కంగారు, ఒత్తిడి కలుగుతున్నాయి. దీనిపై ప్రజల్లో మెరుగైన అవగాహన కల్పించాలని నిర్ణయించుకున్నాను. అందుకే కరోనా నుంచి కోలుకున్న కొండల్ గారితో ఈ రోజు ఫేస్ బుక్ లో సాయంత్రం 6 గంటలకు లైవ్ ఇంటర్వ్యూ చేస్తున్నాను" అంటూ వెల్లడించారు.