వెబ్ సీరీస్ లో రకుల్.. తొలిసారి ద్విపాత్రాభినయం!
- ముమ్మరంగా సాగుతున్న వెబ్ సీరీస్ నిర్మాణం
- కాజల్, సమంత, తమన్నా బాటలో రకుల్
- ట్విన్స్ గా కనిపించనున్న ముద్దుగుమ్మ
ఇప్పటికే కాజల్, సమంత, తమన్నా వంటి తారలు వెబ్ సీరీస్ లలో నటిస్తూ అక్కడ కూడా తమదైన ముద్ర వేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు తాజాగా మరో కథానాయిక రకుల్ ప్రీత్ సింగ్ కూడా వెబ్ సీరీస్ వైపు వస్తోంది. తాజాగా ఆమె ఓ వెబ్ సీరీస్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.
విశేషం ఏమిటంటే, ఇందులో తొలిసారిగా ఆమె ద్విపాత్రాభినయం చేస్తుందనీ, అది కూడా కవలలుగా నటిస్తుందనీ తెలుస్తోంది. ఈ ట్విన్స్ ప్రతి విషయంలోనూ ఒకరితో ఒకరు పోటీ పడుతుంటారనీ, ఆ వైనం ఆసక్తికరంగా సాగుతుందనీ చెబుతున్నారు. ఓపక్క సినిమాలలో అవకాశాలు తగ్గుతుండడంతో అమ్మడు ముందు జాగ్రత్తగా వెబ్ సీరీస్ లోకి ఎంట్రీ ఇస్తోందన్న కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి.