భార్య ఉపాసనను ప్రశంసిస్తూ.. పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన రామ్ చరణ్!
- తన భార్య ఫొటో పోస్ట్ చేసిన చెర్రీ
- దయ చూపుతూ ఆమె మంచి పనులు చేస్తోందని వ్యాఖ్య
- అవి ఎంత చిన్నవైనా సరే అవి ఎన్నటికీ వృథాకావని ప్రశంసలు
కాగా, ఉపాసన సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ చురుకుగా పాల్గొంటుందన్న విషయం తెలిసిందే. తమ ఆసుపత్రి సిబ్బందితో కలిసి ఉపాసన పలు కార్యక్రమాల్లో పాల్గొంటుంది. చెర్రీకి సంబంధించిన ఫొటోలు, అప్‌డేట్‌లను పోస్ట్ చేస్తూ ఆమె సామాజిక మాధ్యమాల ద్వారా మెగా అభిమానులకు దగ్గరైంది.