సుశాంత్ వ్యవహారంలో సీబీఐ విచారణ అక్కర్లేదు... ముంబయి పోలీసులు చాలు: 'మహా' హోంమంత్రి
- ఇటీవల ముంబయిలో హీరో సుశాంత్ రాజ్ పుత్ ఆత్మహత్య
- సీబీఐ విచారణ కోరిన సుబ్రహ్మణ్యస్వామి, రియా చక్రవర్తి
- ముంబయి పోలీసులు సమర్ధులేనన్న మహారాష్ట్ర హోంమంత్రి
ఇలాంటి కేసులను చేపట్టడంలో ముంబయి పోలీసులు సమర్థవంతులేనని అన్నారు. సుశాంత్ కు బాలీవుడ్ లో ఉన్న వృత్తివైరం సహా అనేక కోణాల్లో ముంబయి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని, సీబీఐతో విచారణ ఎందుకని ప్రశ్నించారు. సుశాంత్ ఆత్మహత్య వ్యవహారంలో ఎవరి తప్పిదం ఉన్నట్టు వెల్లడి కాలేదని, దర్యాప్తు మొత్తం పూర్తయ్యాక వివరాలు పంచుకుంటామని అనిల్ దేశ్ ముఖ్ తెలిపారు.