ఈడీ కేసులో ఊరట... టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ కు బెయిల్
- అనుమతి లేకుండా నిధులు డ్రా చేశారంటూ రవిప్రకాశ్ పై ఆరోపణలు
- 2019లో కేసు నమోదు
- ఈసీఐఆర్ నమోదు చేసిన ఈడీ
- అరెస్ట్ భయంతో కోర్టును ఆశ్రయించిన రవిప్రకాశ్
ఈ ఆరోపణలపై ఈడీ వర్గాలు ఎన్ ఫోర్స్ మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ఈసీఐఆర్) నమోదు చేయడంతో, తనను అరెస్ట్ చేస్తారని భావించిన రవిప్రకాశ్ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం రూ.లక్ష చొప్పున రెండు ష్యూరిటీలు సమర్పించాలని ఆదేశిస్తూ ముందస్తు బెయిల్ ఇచ్చింది. అంతేకాదు. ప్రతి శనివారం ఈడీ ఎదుట విచారణకు హాజరు కావాలని స్పష్టం చేసింది.