కొత్త పార్టీ పేరును ప్రకటించడానికి సిద్ధమవుతున్న సూపర్‌స్టార్ రజనీకాంత్
- మార్చిలోనే ప్రకటిద్దామనుకున్న రజనీ
- కరోనా వ్యాప్తితో వాయిదా
- కొత్త తేదీపై సమాలోచనలు
ఈ ఏడాదిలోనే రజనీ తన రాజకీయ పార్టీని ప్రకటిస్తారని మొదటి నుంచి వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. వాస్తవానికి ఆయన ఇప్పటికే పార్టీ పేరును ప్రకటించాల్సి ఉండగా కరోనా విజృంభణ నేపథ్యంలో ఆ కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్నారని సమాచారం. మార్చి 12వ తేదీనే పార్టీని ప్రారంభిద్దామని రజనీ భావించారని, కరోనా ప్రభావంతో వాయిదా వేశారని రజనీ సన్నిహితుడు తియగరాజన్ తెలిపారు.
వచ్చేనెలలో పార్టీని ప్రకటిద్దామని కూడా రజనీ భావించారని, అయితే, కరోనా ఇప్పట్లో పోయేలా లేకపోవడంతో మరింత ఆలస్యం జరిగే అవకాశాలూ లేకపోలేదని ప్రచారం జరుగుతోంది. ఆయన ఈ ఏడాది నవంబర్‌లో పార్టీ పేరును ప్రకటించాలా? అన్న అంశాన్ని కూడా యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రజనీకాంత్ శివ దర్శకత్వంలో అన్నాతై అనే సినిమాలో నటిస్తున్నారు.