Tamilnadu: తమిళనాడులో పట్టుబడ్డ డబ్బుపై వివరణ ఇస్తూ వీడియో విడుదల చేసిన బాలినేని!

Balineni Comments on Cash Seised in Tamilnadu

  • కారుపై ఉన్న స్టిక్కర్ ఒరిజినల్ కాదు
  • అది ఫోటోస్టాట్ కాపీ మాత్రమే
  • అన్ని కోణాల్లోనూ విచారణ జరిపించండి
  • ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని

ఆంధ్రప్రదేశ్ నుంచి తమిళనాడుకు వెళుతూ, చెన్నై సమీపంలో పట్టుబడిన ఓ కారులో రూ. 5 కోట్లు పట్టుబడటం, ఆ కారుపై ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ స్టిక్కర్ ఉండటంతో, ఇది వైసీపీ అక్రమ సంపాదన అని, పక్క రాష్ట్రాలకు తరలిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ, బాలినేని స్పందిస్తూ, ఓ వీడియోను విడుదల చేశారు. ఈ కారుకు, పార్టీకి సంబంధం లేదన్నారు. ఈ విషయం విచారణలో తెలుస్తుందని తెలిపారు.

 తనకు తెలిసినంత వరకూ కారుపై ఉన్న స్టిక్కర్ ఒరిజినల్ కాదని, జిరాక్స్ కాపీ అని వ్యాఖ్యానించారు. ఆ వాహనం తమిళనాడులో రిజిస్టర్ అయిందని గుర్తు చేసిన ఆయన, స్టిక్కర్ ఫోటోస్టాట్ కాపీ అని, దీన్ని మీడియా వారు పరిశీలిస్తే, వారే గుర్తించగలరని అన్నారు. ఈ డబ్బు తనకు సంబంధించినది మాత్రం కాదని, అన్ని కోణాల్లోనూ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నానని అన్నారు. తప్పు ఎవరిదైనా శిక్షించాలని డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News