అల్లు అర్జున్ సినిమా నుంచి తప్పుకోవడానికి కారణం ఇదే: విజయ్ సేతుపతి
- కాల్షీట్ల సమస్య వల్లే సినిమా నుంచి తప్పుకున్నాను
- సుకుమార్ ను వ్యక్తిగతంగా కలిసి పరిస్థితిని వివరించా
- తన వల్ల షూటింగ్ కు ఇబ్బంది కలగకూడదనే ఈ నిర్ణయం
తాజాగా ఈ అంశంపై ఓ ఆంగ్ల మీడియాతో మాట్లాడుతూ విజయ్ సేతుపతి క్లారిటీ ఇచ్చారు. తాను 'పుష్ప' సినిమాను చేయడం లేదనే వార్తలో నిజం ఉందని ఆయన చెప్పారు. కాల్షీట్ల సమస్య వల్లే సినిమా నుంచి తాను తప్పుకున్నానని తెలిపారు. సుకుమార్ ని వ్యక్తిగతంగా కలిసి తన కాల్షీట్ల సమస్య గురించి చెప్పానని వెల్లడించారు. డేట్ల సమస్య కారణంగా సినిమా షూటింగ్ కు ఇబ్బంది కలగకూడదనే ఆలోచనతోనే సినిమా నుంచి తప్పుకున్నానని తెలిపారు.